ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం... ఇద్దరు పీజీ విద్యార్థినులకు పాజిటివ్

  • తెలంగాణలో ప్రబలుతున్న కరోనా
  • విద్యాసంస్థలు, హాస్టళ్ల నుంచి అధికంగా కేసులు
  • ఓయూ లేడీస్ హాస్టల్లో 400 మంది విద్యార్థినులు
  • ఆసుపత్రికి పాజిటివ్ వచ్చిన విద్యార్థుల తరలింపు
తెలంగాణ విద్యాసంస్థల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలోనూ కరోనా వ్యాప్తి వెల్లడైంది. ఓయూ అమ్మాయిల వసతిగృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. వారిద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోఠీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఓయూ లేడీస్ హాస్టల్లో 400 మంది విద్యార్థినులు ఉన్నారు.

అటు, నగరంలోని పలు స్కూళ్లు, హాస్టళ్లలోనూ కరోనా తీవ్రతరం అవుతుండడం అధికారులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజేంద్రనగర్ లోని ఎస్టీ బాలుర హాస్టల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే బండ్లగూడ మైనారిటీ గురుకుల పాఠశాలలో 38 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇతర జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. జగిత్యాల బీసీ సంక్షేమ వసతిగృహంలో 17 మంది బాలికలకు కరోనా సోకింది.

Osmania University
Ladies Hostel
Corona Virus
Positive Cases
Telangana

More Telugu News